విశాఖ సముద్రతీరానికి కొట్టుకువచ్చిన బారీ కర్రపెట్టె

September 30, 2023
img

విశాఖలో సముద్రతీరానికి ఓ బారీ కర్రపెట్టె కొట్టుకువచ్చింది. దాని బరువు సుమారు 100 టన్నులు ఉంటుంది. దానిని చూసేందుకు భారీగా జనాలు తరలి రావడంతో సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకొన్నారు.

అది బ్రిటిష్ కాలం నాటి కర్ర పెట్టెగా వారు గుర్తించారు. ఆ పెట్టె చాలా బరువుగా ఉండటంతో దానిలో ఏవైనా ప్రేలుడు పదార్ధాలు ఉండవచ్చని బాంబులను నిర్వీర్యం చేసే నిపుణులను కూడా పిలిపించారు. పోలీసులు జేసీబీని తెప్పించి వారి సమక్షంలో ఆ పెట్టెను జాగ్రత్తగా బద్దలు కొట్టి చూడగా దానిలో పెద్ద పెద్ద కర్ర దుంగలు మాత్రమే ఉన్నాయి!

గతంలో పెద్ద పడవలు సముద్రంలో లంగరు వేసేందుకు అటువంటి దుంగాలను వాడేవారని ఆర్కియాలజీ సిబ్బంది తెలిపారు. అంత పెద్ద పెట్టె తీరానికి కొట్టుకు వస్తే దానిలో ఏదో ఉందనుకొంటే కర్ర దుంగలు చూసి అందరూ నవ్వుకొన్నారు. 

Related Post