గణేశ్ నిమజ్జనాలు పూర్తవడంతో హెచ్‌ఎండీఏ సిబ్బంది హుస్సేన్‌సాగర్ నుంచి శనివారం ఉదయం వరకు దాదాపు 30 టన్నుల వ్యర్ధాలను తొలగించారు. ఇంకా మరో 40-50 టన్నులు వరకు వ్యర్ధాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా టాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ వద్ద చాలా విగ్రహాలు నిమజ్జనం చేయడంతో అక్కడే భారీగా వ్యర్ధాలు పేరుకుపోయాయి.
హెచ్‌ఎండీఏ సిబ్బంది క్రేన్ల సాయంతో వ్యర్ధాలను బయటకు తీస్తుంటే వాటిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది టిప్పర్లలో దంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఒకటి రెండు రోజులలోగా మిగిలిన వ్యర్ధాలను కూడా బయటకు తీసి తరలించడానికి ప్రయత్నిస్తున్నారు.
గతంతో పోలిస్తే ఇప్పుడు పర్యావరణ హిత మట్టి విగ్రహాల సంఖ్య పెరిగినప్పటికీ నేటికీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసే వేలాది విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తూనే ఉన్నారు. కనుక జీహెచ్‌ఎంసీ నగరం నలువైపులా తాత్కాలిక చెరువులు ఏర్పాటు చేసి వాటిలోనే నిమజ్జనం చేసేలా ప్రోత్సహించడం సత్ఫలితాలు ఇస్తోంది.