పార్లమెంట్ వద్ద తమన్నా!

September 21, 2023
img

ప్రముఖ టాలీవుడ్ నటి తమన్నా భాటియా గురువారం కొత్త పార్లమెంట్ భవనం వద్ద ఎర్రచెరలో తళుక్కుమన్నారు. ఆమెను చూసి మీడియా ప్రతినిధులు అందరూ తమ కెమెరాలను క్లిక్‌మనిపించారు.

ఆమె వారితో మాట్లాడుతూ, “కొత్త పార్లమెంట్ భవనం సందర్శించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం నాకు ఆహ్వానం పంపడంతో వచ్చాను. కొత్త పార్లమెంట్ భవనం చాలా అద్భుతంగా దేశ ప్రతిష్టను ఇనుమడించేలా ఉంది. పరిసరాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి.

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కాగానే మొట్ట మొదట మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదించడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఎన్నో ఏళ్ళుగా పెండింగులో ఉన్న ఈ బిల్లును మోడీ సర్కార్ ఆమోదించినందుకు ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రమంత్రులను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను,” అని అన్నారు. 

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అయిన తర్వాత ఇప్పటి వరకు సినీ నటులు కంగనా రనౌత్, షెహ్ నాజ్ గిల్, భూమి ఫడ్నెకర్, ఖుష్బూ తదితరులు సందర్శించి వెళ్లారు. ఇవాళ్ళ తమన్నా, దివ్యా దత్తా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించి వెళ్ళారు. మంచు లక్ష్మి బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్ళిన్నట్లు తాజా సమాచారం.

Related Post