ఆషాడ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్లు మంజూరు

June 01, 2023
img

ఈ నెల 22న ఆషాడ బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆనవాయితీ ప్రకారం ముందుగా గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారి ఆలయంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో నెలరోజుల పాటు సాగే బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిభింబించే ఈ బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. దేవాదాయశాఖ పరిధిలోలేని దేవాలయాలకు సైతం ఈ బోనాల ఉత్సవ నిర్వహణకు ఆర్ధికసాయం అందజేస్తున్నామని తెలిపారు.

జూలై 8న సికింద్రాబాద్‌ మహంకాళీ అమ్మవారి బోనాలు, మర్నాడు అక్కడే ఆలయ ఆవరణలో రంగం, జూలై 16న పాతబస్తీలో బోనాలు జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా తెలంగాణ జానపద కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు.

Related Post