ఆడి కారులో వచ్చి రోడ్డుపక్క టీస్టాల్!

May 31, 2023
img

అవును... ముంబైలో ఓ యువకుడు రోజూ ఖరీదైన ఆడి కారులో వచ్చి రోడ్డు పక్కన టీ అమ్ముతున్నాడు. అది చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. కానీ ఎందుకు అలా చేస్తున్నాడో అనుకొంటూ తెలుసుకొనేదుకు ఓ కప్పు టీ తాగి వెళుతుండటంతో అతని రోడ్డు పక్క టీస్టాల్ బ్రహ్మాండంగా నడుస్తోంది. 

ఆ యువకుడి పేరు మన్ను శర్మ. డబ్బుకి కరువు లేదు. కనుక ఏదైనా మంచి బిజినెస్ చేయాలనుకొన్నాడు. అయితే అందరిలా ఏదో ఒకటి చేయడం కాదు... చేసే బిజినెస్‌తో పాపులర్ అవ్వాలనుకొన్నాడు. బాగా ఆలోచించి 60-70 లక్షలు పెట్టి ఓ ఆడి కారు కొన్నాడు. కారు డిక్కీలో చిన్న బల్ల, ఓ స్టౌవ్, టీ తయారు చేయడానికి అవసరమైన సామాగ్రి పెట్టుకొని ముంబైలో పోష్ ఏరియాలలో ఒకటైన లోఖండ్ వాలా వద్దకు చేరుకొని, రోడ్డు పక్కన టీస్టాల్ పెట్టుకొని టీ అమ్ముతున్నాడు. “థింక్ లగ్జరీ... డ్రింక్ లగ్జరీ” అంటూ అంత ఖరీదైన కారులో వచ్చి టీ అమ్ముతుంటే మొదట్లో అందరూ ఆశ్చర్యపోయేవారు కానీ ఇప్పుడు క్యూ కడుతున్నారు. ఆ డబ్బు తన కారు పెట్రోల్ ఖర్చుకు కూడా సరిపోదు కానీ తన ఐడియా సక్సస్ అయ్యిందని, టీస్టాల్ బాగా నడుస్తునందుకు చాలా ఆనందంగా ఉందని మన్నుశర్మ పొంగిపోతున్నాడు.

Related Post