సోషల్ మీడియాలో బేబీ బంప్ ప్రదర్శనలు అవసరమా?

May 26, 2023
img

మాతృత్వం స్త్రీలకు ఓ వరం. ఆ కుటుంబానికి ఎంతో సంతోషం కలిగించే విషయం. ఇది పూర్తిగా వ్యక్తిగతం. ఆ కుటుంబానికి సంబందించి విషయం. కానీ ఇటీవల సెలబ్రేటీలు గర్బం దాల్చితే వారు చెప్పక ముందే దాని గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలైపోతున్నాయి. కనుక వారు వాటిని ఖండించడమో, లేదా ధృవీకరించడం కోసం ఇదిగో ‘బేబీ బంప్’ అంటూ ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో ఇదీ ఓ కొత్త ట్రెండ్ అయిపోయింది. 

అందుకే ప్రముఖ నటి ఇలియానా కూడా ‘బేబీ బంప్’ కనబడేలా ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మొదట కొడుకు పుట్టబోతున్నాడన్నట్లు మెసేజ్‌ పెట్టిన ఇలియానా తర్వాత ‘ఏంజల్’ ఆడపిల్ల పుట్టబోతున్నట్లు మెసేజ్‌ పెట్టింది. అయితే ఆమె వివాహం చేసుకోలేదు! 

ఇదివరకు ఆమె ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌ సహజీవనం చేసింది. కానీ మనస్పర్ధలు రావడంతో 2019లో విడిపోయారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటోంది. తర్వాత కొన్ని రోజులు సాటి నటి కత్రీనా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచల్‌తో కలిసి తిరిగింది. కనుక ఇలియానాకు పుట్టబోయే బిడ్డకి తండ్రి అతనే అయ్యుంటాడని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇలియానా వాటిని ఖండించలేదు. ధృవీకరించలేదు. కానీ తాను గర్భం దాల్చానని మాత్రం ఎప్పటికప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతోంది. ఇందుకు నవ్వాలో, ఏడ్వాలో? అయినా సోషల్ మీడియాలో ఈ బేబీ బంప్స్ ప్రదర్శనలు అవసరమా?   


Related Post