దయచేసి గమనించగలరు: నేను ఇంకా బ్రతికే ఉన్నాను!

May 25, 2023
img

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని సద్వినియోగం చేసుకొంటున్నవారి కంటే దుర్వినియోగం చేస్తున్నవారే ఎక్కువమంది కనిపిస్తారు. ముఖ్యంగా సినీ, రాజకీయ, పారిశ్రామిక తదితర రాన్గాలలోని సెలబ్రేటీలకు సోషల్ మీడియాయే పెద్ద వరం అదే శాపంగా కూడా నిలుస్తోంది.

హీరోయిన్లకు ఫలానా వారితో అఫైర్ నడుస్తోందనో లేదా ఫలానా హీరో ఫ్లాప్ అయ్యిందనో  లేదా ఎవరైనా హాస్పిటల్లో చేరిన్నట్లయితే అనారోగ్యంతో చనిపోయారనో పుకార్లు వ్యాపింపజేయడం పరిపాటిగా మారిపోయింది. కొంతకాలం క్రితం ప్రముఖ కమెడీయన్ సుధాకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి సినిమాలు చేయడం మానుకొని ఇంట్లోనే ఉంటున్నారు.

అప్పుడప్పుడు వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళి వస్తుండటం సహజమే. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు హాస్పిటలో చేర్పించారని కొందరు, కోమాలోకి వెళ్లిపోయారని, కొందరైతే ఆయన చనిపోయారంటూ పుకార్లు పుట్టించారు. సోషల్ మీడియాలో లైక్స్ కోసమో అదనపు సంపాదన కోసం ఆరోగ్యంగా ఉన్నవారి గురించి ఇలాంటి నీచమైన పుకార్లు పుట్టించడం చాలా హేయమైన ఆలోచన. అవి చూసి ఆయన, వారి కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఊహించుకోవచ్చు.

ఈ పుకార్లు ఆయన చెవిలో పడటంతో ఆయన స్పందిస్తూ, “నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నా గురించి తప్పుడు సమాచారం నమ్మకండి. నేను చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. ఐయాం వెరీ హ్యాపీ,” అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం పోస్ట్ చేశారు.

బ్రతికి ఉన్నవాళ్ళు ఈవిదంగా మేము ఇంకా బ్రతికే ఉన్నామని, గర్భవతి అయితే ఇదిగో ‘బేబీ బంప్’ అని ఫోటోలు, వీడియోలు తీసుకొని ప్రజలకు వాస్తవాలు వివరించాల్సి వస్తోందంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది?సోషల్ మీడియాలో ఈ అవలక్షణాలకు మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. 1. సోషల్ మీడియాపై ప్రభుత్వ, పోలీస్ నియంత్రణ లేకపోవడం. 2. ఎక్కడో దూరదేశాలలో ఉన్న తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధైర్యం. 3. నైతిక విలువలను పాటించాలనే వివేకం లేకపోవడం.

Video Courtecy: NTV Telugu 

Related Post