మా మద్య గొడవలు మామూలే... ఇదేం పెద్ద విషయం కాదు: విష్ణు

March 24, 2023
img

మంచు విష్ణు, మంచు మనోజ్ మద్య గొడవలు సోషల్ మీడియా వరకు వచ్చేయడంతో వారి తండ్రి మోహన్ బాబు ఇద్దరినీ మందలించారు. మంచు విష్ణు ఈ గొడవ గురించి మాట్లాడుతూ, ఏ ఇంట్లో అయినా అన్నదమ్ముల మద్య ఇటువంటి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. మా ఇద్దరి మద్య కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు జరిగింది అటువంటిదే. పెద్ద సీరియస్ విషయమేమీ కాదు. దీనిని పట్టించుకోనవసరం లేదు. తమ్ముడు మనోజ్ చిన్నోడు... కనుక ఆవేశంతో ఫేస్‌బుక్‌లో పెట్టేశాడు,” అని అన్నాడు.  

వారి సోదరి మంచు లక్ష్మి స్పందిస్తూ, “నాకు ఈ గొడవ గురించి తెలియదు. నేను ఆ వీడియోను చూడలేదు. అయినా అన్నదమ్ముల మద్య చిన్నచిన్న గొడవలు కామనే కదా?” అన్నారు. 

 మంచు సోదరులకు వరుసకు బాబాయ్ అయిన సారధితో మంచు విష్ణుకు చాలా రోజులుగా చిన్న చిన్న గొడవలు జరుగున్నాయి. నిన్న సాయంత్రం కూడా వారిద్దరూ గొడవపడ్డారు. మళ్ళీ రాత్రి 10 గంటలకు మంచు విష్ణు ఆయన ఇంట్లో జొరబడి గొడవపడి, ఆయనపై చెయ్యి చేసుకొన్నాడు. ఈ విషయం తెలుసుకొన్న మంచు మనోజ్ వెంటనే తన ఫేస్‌బుక్‌ పేజీలో అన్నయ్య వారితో గొడవపడుతున్న వీడియోను అప్‌లోడ్‌ చేసేశాడు. దాంతో మంచు సోదరుల గొడవలు సోషల్ మీడియాకు పాకిపోయాయి. వెంటనే మోహన్ బాబు ఫోన్‌ చేసి మందలించడంతో మనోజ్ ఆ వీడియోని డిలీట్ చేశాడు.

Related Post