కాళ్ళ మీద పడుతుంటే కవిత కాదనగలరా?

March 22, 2023
img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న ఉదయం ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులోని సిఎం కేసీఆర్‌ నివాసం నుంచి బయలుదేరుతుంటే, పలువురు టిఆర్ఎస్‌ నేతలు వంగి వంగి ఆమెకు దండాలు పెట్టగా, కొంతమంది ఆమె పాదాలకు నమస్కరించారు. రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నేత గీత అయినాలా ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి  “ఇదేంది.??యోగనిద్ర ముగించుకుని, సమాధిలో నుండి బయటకు వస్తున్న "అమ్మా భగవాన్" కి మొక్కినట్లు మొక్కుతున్నారు ఆమె కాళ్ళకి..?? Why.?? అమృతం మాత్రమేనా.? విభూతి గట్రా ఏమైనా ఇస్తదా..?? గడీల పాలన ఎలా ఉండేదో, దొరల, దొరసానుల అహంకారం యెట్లుండేదో వీళ్ళని చూస్తే అర్ధం ఔతుంది.!” అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. 

నిజమే... నేటికీ రాజకీయాలలో ‘కాళ్ళ మీద పడే’ ఈ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. పెద్దల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం భారతీయ సంస్కృతి గొప్పదనం. కానీ రాజకీయ అవసరాలు, పదవులు, టికెట్ల కోసం నేతల కాళ్ళ మీద పడటం చాలా అవమానకరమైన దుసంస్కృతే. కానీ దీనిని సదరు నేతలు వద్దనుకోవడం లేదు. పైగా విధేయతను గుర్తించేందుకు ఇదో సులువైన మార్గం అని భావిస్తున్నారు కూడా. కనుక కాళ్ళ మీద పడేవాళ్ళు పడుతూనే ఉన్నారు. అయినా జనాలు వచ్చి తమ కాళ్ళ మీద పడుతుంటే ఏవేరు మాత్రం వద్దనుకొంటారు?

Related Post