సినీ పరిశ్రమకి ఏదో శాపం తగిలిన్నట్లుంది. మొన్న కె విశ్వనాధ్, అంతకు ముందు దర్శకుడు సాగర్, ఈరోజు ఉదయం గాయని వాణీ జయరాం, నిర్మాత గురుపాదం వరుసగా ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయారు. ఈరోజు ఉదయం చెన్నైలో వాణీ జయరాం మృతి చెందగా, ఈరోజు ఉదయమే బెంగళూరులోని తన నివాసంలో ఆర్‌వి. గురునాధం గుండెపోటుతో మృతి చెందారు. తెలుగులో ఆయన పులి బెబ్బులి, వయ్యారి భామలు వగలమారి భర్తలు తదితర సినిమాలని నిర్మించారు. తెలుగు, హిందీ, కన్నడ సినిమాలలో కలిపి మొత్తం 25 సినిమాలని ఆయన నిర్మించారు. తమిళంలో, మలయాళంలో హిట్ అయిన అనేక సినిమాలని తెలుగులో అనువాద చిత్రాలుగా విడుదల చేశారు. ఆయన మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.