త్రిదండి చిన్న జీయర్ స్వామికి పద్మభూషణ్ అవార్డు

January 26, 2023
img

కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరంకి పద్మ అవార్డులు ప్రకటించింది. మొత్తం 106 మందికి అవార్డులు ప్రకటించగా వాటిలో తెలంగాణకి 5, ఏపీకి 7 కలిపి మొత్తం 12 అవార్డులు లభించాయి.

తెలంగాణ రాష్ట్రంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి (ఆధ్యాత్మికం), కమలేష్ డి పటేల్‌(ఆధ్యాత్మికం)లకి పద్మభూషణ్ అవార్డులు, ఎం.విజయ్ గుప్త (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), పి.హనుమంతరావు (వైద్యం), బి.రామకృష్ణా రెడ్డి (సాహిత్యం, విద్య)లకి పద్మశ్రీ అవార్డులు లభించాయి. 

ఏపీలో సంగీత దర్శకుడు కీరవాణి (కళలు), అబ్బారెడ్డి నాగేశ్వరరావు(సైన్స్ అండ్ ఇంజనీరింగ్), గణేశ్ నాగప్ప కృష్ణరాజ నగర (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), కె.సచ్చిదానంద శాస్త్రి (కళలు), సంకురాత్రి చంద్రశేఖర్ (సమాజాసేవ), ప్రకాష్ చంద్ర సూద్ (సాహిత్యం, విద్య)లకి పద్మశ్రీ పురస్కారాలకి ఎంపికయ్యారు. 

పద్మశ్రీ: సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి, ఎం.విజయ్ గుప్తా, ప్రకాష్ చంద్ర సూద్ (ప్రొఫెసర్, అణుశాస్త్రవేత్త), డాక్టర్ ఖాదర్ వలీ,  

పద్మవిభూషణ్: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్, వాస్తుశిల్పి బాలకృష్ణ దోషి, ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ మహాలనబీస్, ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త (అమెరికా) శ్రీనివాస్ వర్ధన్, ఎస్ఎం కృష్ణ, ములాయం సింగ్‌ యాదవ్ తదితరులు.     

 పద్మభూషణ్: వాణీ జయరాం, కుమార మంగళం బిర్లా, సుధానారాయణ మూర్తి, ప్రముఖ నవలా రచయిత, తత్వవేత్త ఎస్ఎల్.భైరప్ప (కర్ణాటక), ఫిజిక్స్ ప్రొఫెసర్ దీపక్ దర్ (మహారాష్ట్ర), ఇంగ్లీష్ ప్రొఫెసర్ (కపిల్ కపూర్), సుమన్ కళ్యాణ్ పూర్ (బాలీవుడ్‌ గాయని) తదితరులు. 

రాష్ట్రాలవారీగా: మహారాష్ట్ర 12, కర్ణాటక: 8, గుజరాత్‌: 8, ఉత్తర ప్రదేశ్:8, ఏపీ:7, తెలంగాణ:5, పశ్చిమబెంగాల్:4, ఢిల్లీ: 4, ఒడిశా:4, బిహార్‌: 3, అస్సామ్:3, రాజస్థాన్‌:3, ఛత్తీస్‌ఘడ్‌: 3, మద్యప్రదేశ్ రాష్ట్రానికి 3 అవార్డులు దక్కాయి. పద్మ అవార్డు గ్రహీతలకి మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు.  

సినిమాలు, రాజకీయాలలో రాణించిన జయప్రద, జయసుద, విజయశాంతిలకి ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే ప్రముఖ నటి జమునకి ఈసారి కూడా ఎటువంటి అవార్డు ఇవ్వలేదు. మరణోపరాంతం కొంతమందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అలనాటి మేటి నటులైన ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణలని కూడా పట్టించుకోలేదు. 

Related Post