త్రివిక్రం శ్రీనివాస్‌ కొత్త కారు... వామ్మో అంత ధరా!

December 02, 2022
img

మాటల మాంత్రికుడుగా పేరు పొందిన త్రివిక్రం శ్రీనివాస్‌ దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకొంటూనే ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన తర్వాత జూ.ఎన్టీఆర్‌తో మరో సినిమా చేయబోతున్నారు. సాధారణంగా ఈ స్థాయి దర్శకులకి హిట్ సినిమా ఇచ్చినందుకు నిర్మాతలో, హీరోలో కారీదైన కార్లు బహుమానంగా ఇస్తుంటారు. కానీ త్రివిక్రం శ్రీనివాస్‌ తన సొంత డబ్బుతోనే ఓ ఖరీదైన బీఎం డబ్ల్యూ కారు కొనుగోలు చేశారు. దాని ధర వినే కళ్ళు తిరిగిపోవాల్సిందే. అక్షరాల ఒక కోటి ముప్పై నాలుగు లక్షలు. ఆ కారుని, తాళాలను సదరు సంస్థ ప్రతినిధి త్రివిక్రం శ్రీనివాస్‌ ఇంటికి తీసుకువచ్చి అందజేశారు. త్రివిక్రం శ్రీనివాస్‌ ఇంట్లో ఇప్పటికే ఖరీదైన కార్లు రెండుమూడున్నాయి. ఇప్పుడు వాటన్నిటి కంటే ఖరీదైన ఈ కారు వచ్చి చేరింది.      


Related Post