దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జి ఒక్కటే కాదు... బోటింగ్ కూడా!

November 24, 2022
img

ఒకప్పుడు దుర్గందం వెదజల్లే దుర్గంచెరువు ఇప్పుడు హైదరాబాద్‌ నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రభుత్వం దుర్గంచెరువు మీద కేబిల్ బ్రిడ్జ్ నిర్మించేసి చేతులు దులుపుకోకుండా కిందన చెరువును సమూలంగా ప్రక్షాళన చేసి, చెరువు పక్కన మంచి పార్కును అభివృద్ధి చేయడంతో ఇప్పుడు నిత్యం పర్యాటకులతో దుర్గంచెరువు పార్క్ కూడా కళకళలాడుతోంది. 

ఇప్పుడు దానికి మరో సరికొత్త ఆకర్షణగా బోటింగ్ శిక్షణ స్కూల్‌ని కూడా ప్రారంభిస్తున్నట్లు హెచ్ఎండీయే ప్రకటించింది. బాలారిష్టాలన్నిటినీ అధిగమించుకొంటూ చివరికి బోటింగ్ (యాటింగ్) స్కూలుని ప్రారంభించినట్లు తెలిపింది. దీనిని హైదరాబాద్‌ యాట్‌ క్లబ్ మరియు హెచ్ఎండీయే కలిసి నిర్వహించబోతున్నాయి. స్కూలు పిల్లలు, యువతీ యువకులు, మహిళలు ఎవరికైనా శిక్షణ ఇస్తామని ఆసక్తి గలవారు www.ychfoundation.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. అదే వెబ్‌సైట్‌లో దీనికి సంబందించి ఫీజు, శిక్షణ కాలం, షెడ్యూల్ వగైరా పూర్తి వివరాలను చూడవచ్చు.  

ఇప్పుడు దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జి మీద తరచూ సినిమా షూటింగ్‌లు కూడా సాగుతున్నాయి. అందుకే చాలా సినిమాలలో దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జి కనిపిస్తోందిప్పుడు. 

Related Post