గమనిక: మేము కలిసే ఉన్నాం... విడాకులు తీసుకోవడం లేదు: శ్రీకాంత్

November 22, 2022
img

ఇటీవల ఎవరో ఒక సెలబ్రేటీ జంట విడిపోతోందంటూ సోషల్ మీడియాలో, వెబ్‌సైట్‌లలో పుకార్లు పుట్టించడం దూరాలవాటుగా మారింది. ఓ వ్యక్తి తనకి సోషల్ మీడియాలో ఎక్కువ లైక్స్ రావలనో లేదా వెబ్‌సైట్‌, యూ ట్యూబ్ ఛానల్స్ పాపులర్ అవ్వాలనో పుట్టిస్తున్న ఇటువంటి పుకార్లతో సదరు సెలబ్రేటీలు ఎన్ని ఇబ్బందులు పడతారో వారికి అనవసరం. తమకి పేరొస్తే చాలనుకొంటారు. 

ఆవిదంగా పుట్టుకొచ్చిందే నటులు శ్రీకాంత్, ఊహ దంపతుల విడాకుల వార్త. ఇటీవల శ్రీకాంత్‌ ఆర్ధిక సమస్యలు చుట్టూముట్టడంతో భార్యాభర్తల మద్య విభేధాలు మొదలయ్యి చివరికి విడాకులు తీసుకొనేందుకు ఇద్దరూ సిద్దపద్దారంటూ పుకార్లు పుట్టాయి. అవి బంధుమిత్రుల ద్వారా శ్రీకాంత్ భార్య ఊహ చెవిన పడటంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం శ్రీకాంత్ స్వయంగా తెలియజేశారు. తామిద్దరం త్వరలో అరుణాచలం యాత్రకు బయలుదేరుతున్నామని, ఇటువంటి సమయంలో బంధుమిత్రులు ఫోన్‌లు చేసి విడాకులు తీసుకొంటున్నారా? అని అడుగుతుండటం చాలా ఇబ్బందికరంగా ఉందని శ్రీకాంత్ చెప్పారు. తమ గురించి ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ చానల్స్ మీద త్వరలోనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని శ్రీకాంత్ తెలిపారు.

Related Post