అమృత్‌సర్‌ స్వర్ణమందిరంలో అల్లు అర్జున్‌ కుటుంబం

September 29, 2022
img

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ఈరోజు తన భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా భార్యా ఇద్దరు పిల్లలతో కలిసి పంజాబ్ రాష్ట్రంలో అమృత్‌సర్‌ స్వర్ణమందిరాన్ని దర్శించుకొని పూజలలో పాల్గొన్నారు. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో అల్లు అర్జున్‌ని చూసి స్థానిక పంజాబీలు ఆప్యాయంగా పలకరించారు. అల్లు అర్జున్‌ కుటుంబం కూడా వారికి నమస్కరిస్తూ ఆలయంలోకి వెళ్ళి పూజలలో పాల్గొన్నారు. అక్కడి ఆలయ సాంప్రదాయం ప్రకారం అల్లు అర్జున్‌, కుమారుడు అయాన్ ఇద్దరూ నెత్తికి గుడ్డ చూట్టుకోగా, స్నేహారెడ్డి, వారి కుమార్తె అర్హ ఇద్దరూ చున్నీలను తలపై కప్పుకొని పూజలలో పాల్గొన్నారు. 

వచ్చే నెల 1వ తేదీ నుంచి పుష్ప2 సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది కనుక అల్లు అర్జున్‌ మళ్ళీ కుటుంబంతో గడిపేందుకు సమయం చిక్కదు. అందుకే ఖాళీగా ఉన్నప్పుడే అమెరికా పర్యటనకు వెళ్ళి వచ్చి ఇప్పుడు అమృత్‌సర్‌ స్వర్ణమందిరం కూడా దర్శించుకొన్నారు. 


Related Post