మహేష్ బాబు ఇంట్లో టక్కరి దొంగ... పాపం దొరికిపోయాడు

September 29, 2022
img

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో మొన్న రాత్రి దొంగతనం చేయబోయి దొరికిపోయాడో దొంగ. అతని పేరు కృష్ణ . అతనికి సుమారు 40 ఏళ్ళు ఉంటాయి. కొన్ని రోజుల క్రితమే ఒడిశా నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్: 81లో మహేష్ బాబు ఇంటికి సమీపంలో ఓ నర్సరీలో దినసరి కూలీగా చేరాడు. మంగళవారం రాత్రి సుమారు 11.30 గంటలకు ఉన్న మహేష్ బాబు ఇంట్లో దొంగతనం చేసేందుకు బయలుదేరాడు. అయితే ఇంటి చుట్టూ పది అడుగుల ఎత్తు ఉన్న కాంపౌండ్ వాల్‌పై నుంచి కిందకు దూకినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. దాంతో అతను నొప్పి భరించలేక బాధతో కేకలు పెట్టేసరికి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతనిని పట్టుకొన్నారు. వారు అతనిని ప్రశ్నించగా తాను దొంగతనానికి వచ్చానని గోడపై నుంచి దూకడంతో గాయపడ్డానని చెప్పేశాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని అతనిని అంబులెన్సులో ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకువెళ్ళి చేర్చారు. అతను కోలుకొన్న తర్వాత కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. 

మంగళవారం రాత్రి మహేష్ బాబు ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తన తల్లి ఇందిరాదేవి వద్దకు వెళ్ళినప్పుడు ఈ దొంగతనం ప్రయత్నం జరిగింది. మర్నాడు అంటే నిన్న తెల్లవారుజామున ఇందిరాదేవి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అందరూ ఆ విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.   


Related Post