తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

September 26, 2022
img

రేపు మంగళవారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వాటికి సోమవారం తిరుమలలో అంకురారార్పణ చేస్తారు. ఈరోజు రాత్రి 7గంటలకు శ్రీవారి ఆలయానికి నైరుతీ దిశలో భూమాతకు పూజలు చేసి పుట్టమన్ను తీసుకొస్తారు. దానిలో నవ ధాన్యాలు వేస్తారు. ఈ అంకురార్పణ కార్యక్రమంలో రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. ఆ తర్వాత రేపు సాయంత్రం ధ్వజారోహణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. 

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వివరాలు: 

సెప్టెంబర్‌ 27: ధ్వజారోహణం సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల వరకు. తర్వాత రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామివారిని మాడవీదులలో ఊరేగిస్తారు.    

సెప్టెంబర్‌ 28: ఉదయం 8-10 గంటలకు చిన్న శేష వాహనం, రాత్రి 7-9 గంటలకు హంస వాహనంపై ఊరేగింపు.   

సెప్టెంబర్‌ 29: ఉదయం 8-10 గంటలకు సింహ వాహనం, రాత్రి 7-9 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగింపు.   

సెప్టెంబర్‌ 30: ఉదయం 8-10 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7-9 గంటలకు సర్వభూపాల వాహనంపై ఊరేగింపు. 

అక్టోబర్‌ 1: ఉదయం 8-10 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 7-9 గంటలకు గరుడ వాహనంపై ఊరేగింపు.  

 అక్టోబర్‌ 2: ఉదయం 8-10 గంటలకు హనుమంత వాహనం, రాత్రి 7-9 గంటలకు గజ వాహనంపై ఊరేగింపు. 

అక్టోబర్‌ 3: ఉదయం 8-10 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7-9 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగింపు. 

అక్టోబర్‌ 4: ఉదయం 7గంటలకు రధోత్సవం, రాత్రి 7-9 గంటలకు అశ్వవాహనంపై ఊరేగింపు. 

అక్టోబర్‌ 5: ఉదయం 6 నుంచి 9 గంటల వరకు పుష్కరిణిలో చక్రోత్సవం, రాత్రి 9-10 గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Related Post