ఆదివారం అర్దరాత్రి ఒంటిగంటవరకు మెట్రో

September 24, 2022
img

రేపు సాయంత్రం హైదరాబాద్‌, ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే భారత్‌-ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ చూసేందుకు వెళ్ళబోతున్నారా?అయితే ఇది మీ కోసమే. రేపు రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత మళ్ళీ ఇల్లు చేరుకొనేందుకు వీలుగా హైదరాబాద్‌ మెట్రో ప్రత్యేక సర్వీసులను నడిపించబోతోంది. రేపు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉప్పల్ మెట్రో స్టేషన్‌ నుంచి అమీర్ పేట్, జేబీఎస్ స్టేషన్లకు మెట్రో రైళ్ళు నడుపబోతున్నట్లు హైదరాబాద్‌ మెట్రో అధికారులు ప్రకటించారు. అయితే రాత్రి 10 గంట్ల వరకే మెట్రో స్టేషన్లలో టికెట్ కౌంటర్స్ తెరిచి ఉంటాయి. కనుక ముందుగానే రిటర్న్ టికెట్లు కొనుక్కోవలసి ఉంటుంది లేదా స్మార్ట్ మెట్రో కార్డులు ఉపయోగించి ప్రయాణించవచ్చు. మెట్రో రైళ్ళు నడుస్తున్నంత వరకు మాత్రమే మెట్రో స్టేషన్లలో ఎంట్రీ గేట్లు, ఎగ్జిట్ గేట్లు తెరిచి ఉంటాయి. 

ఇక టీఎస్‌ఆర్టీసీ కూడా ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక సిటీ బస్ సర్వీసులు నడిపించబోతోంది. నగరంలో మేడ్చల్, హకీంపేట్, సికింద్రాబాద్‌, జేబీఎస్, జీడిమెట్ల, ఘాట్ కేసర్, కోఠి, మోహిదీపట్నం, పటాన్ చెరు తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్ సర్వీసులు నడిపించబోతోంది.

Related Post