అక్రమ సంబందమే సూదిమందుకి కారణం?

September 21, 2022
img

ఖమ్మం జిల్లాలో ముదిగొండ మండలం బాణాపురం వద్ద షేక్ జమాల్ సాహెబ్ (40) అనే వ్యక్తిని మూడు రోజుల క్రితం ఓ అపరిచితవ్యక్తి వెనుక నుంచి ఇంజక్షన్ పొడిచి పారిపోగా జమాల్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేసిన ముదిగొండ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజి, సెల్‌ఫోన్‌ లొకేషన్‌, కాల్‌డేటా, ఘటన స్థలంలో లభించిన ఇంజక్షన్ తదితర ఆధారాలతో నిందితుని కోసం గాలించారు. 

ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నరిశెట్టి వెంకటేష్తో పాటు అతనికి సహకరించిన మోహన్ రావు, ఆర్‌ఎంపీ వైద్యుడు బండి వెంకన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాధమిక సమాచారం ప్రకారం షేక్ జమాల్ సాహెబ్ నిందితుల అక్రమ సంబంధానికి అడ్డుతగులుతున్నాడనే కారణంతో వారు ఓ పధకం ప్రకారం హత్య చేశారు. దీని కోసం చాలా ఎక్కువ మోతాదులో మత్తుమందును ఇంజక్షన్ ద్వారా ఇవ్వడం వలన షేక్ జమాల్ సాహెబ్ మొదట స్పృహ కోల్పోయి తర్వాత ప్రాణాలు విడిచాడు. 

చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ మూడు రోజుల క్రితం తన బైక్‌పై ఏపీలోజగ్గయ్యపేట మండలంలోని వల్లభికి వెళుతుండగా దారిలో ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. అతనిని బైక్‌పై ఎక్కించుకొని వెళుతుండగా బాణాపురం సమీపంలో అతను వెనుక నుంచి షేక్ జమాల్ సాహెబ్‌కు ఇంజక్షన్ పొడిచి జమాల్ బండి ఆపగానే పారిపోయాడు . జమాల్ అక్కడే స్పృహ తప్పి పడిపోతూ ఈవిషయం భార్యకి ఫోన్‌ చేసి చెప్పాడు. 108 అంబులెన్సులో జమాల్‌ను హాస్పిటల్‌కు తీసుకువెళుతుండగా దారిలోనే చనిపోయాడు.

Related Post