ప్రకాష్ రాజ్‌ దత్తత తీసుకొన్న కొండారెడ్డిపల్లి గ్రామం ఎలా ఉందో చూశారా?

September 20, 2022
img

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ 2015లో షాద్ నగర్‌ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. దానిని ఆయన ఎంత గొప్పగా అభివృద్ధి చేసారో స్థానికులకు మాత్రమే తెలుసు. ఆ గ్రామం ఎంతగా అభివృద్ధి చెందిందో స్థానిక వ్యక్తి మధుసూదన్ రావు ఫోటోలు తీసి మంత్రి కేటీఆర్‌కు పంపించగా, వాటిని ట్విట్టర్‌లో షేర్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి ప్రకాష్ రాజ్ ఎంతగానో అభివృద్ధి చేశారంటూ ట్వీట్ చేశారు. 

ఎటువంటి అధికారం లేని ఓ వ్యక్తి పూనుకొంటే ఒక ఊరు ఎంతగా అభివృద్ధి చెందుతుందో కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. అదే... అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులలో ఇటువంటి తపన, చిత్తశుద్ధి ఉన్నట్లయితే రాష్ట్రం, దేశం ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఊహించవచ్చు. 


Related Post