ద్రౌపది ముర్ముపై వర్మ అనుచిత వ్యాఖ్యలు

June 24, 2022
img

వివాదాల రాంగోపాల్ వర్మ ఎప్పటిలాగే కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. “ద్రౌపది రాష్ట్రపతి అయితే మరి పాండవులు ఎవరు... ముఖ్యంగా కౌరవులు ఎవరు?” అని ట్వీట్ చేశారు. దీనిపై హైదరాబాద్‌లో బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మపై అబీడ్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళిత మహిళ అయిన ద్రౌపది ముర్మును కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాంగోపాల్ వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. 

రాంగోపాల్ వర్మకి ఇంతవరకు ఎదురుదెబ్బ తగలకపోవడం వలననే ఆయన తాను ఏమి మాట్లాడినా సాగుతుందనే నమ్మకంతో ఉన్నారు. అందుకే కాబోయే రాష్ట్రపతిని సైతం ఈవిదంగా కించపరిచారని చెప్పవచ్చు.    

Related Post