సైబరాబాద్‌లో నేడు మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు

June 21, 2022
img

మంగళవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు ఉదయం కూకట్‌పల్లి పరిధిలోని ఖైతలాపూర్ వద్ద కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవరును మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవం చేయనున్న సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. 

ఎర్రగడ్డ నుంచి మూసాపేట మీదుగా హైటెక్ సిటీకి వెళ్ళే వాహనాలన్నీ మూసాపేట వైజంక్షన్ వద్ద మళ్ళించి కూకట్‌పల్లి రోడ్‌ నంబర్:1, కేపీహెచ్‌బీ, జెఎన్‌టీయూ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 

బాలానగర్ వై జంక్షన్ నుంచి హైటెక్స్‌కు వెళ్ళే వాహనాలన్నీ ఐడీఎల్‌ ట్యాంక్‌ వద్ద నుంచి ఐడీఎల్‌ ఎంట్రెన్స్‌ నుంచి కూకట్‌పల్లి రోడ్డు నంబర్‌: 1, కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది.

హఫీజ్‌పేట నుంచి ఖైతలాపూర్‌ మీదుగా వెళ్ళే వాహనాలు ఆర్‌యూబీ వద్ద నుంచి జేఎన్‌టీయూ మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది.

Related Post