తెలంగాణలో మందుబాబులకు షాక్

May 19, 2022
img

తెలంగాణలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బీరు, లిక్కర్, వైన్ ధరలను పెంచేసింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని తెలియజేస్తూ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఉత్తర్వులలో జారీ చేశారు. 

దాని ప్రకారం సాధారణ, మీడియం రకాల మద్యం ధరలు 180 ఎంఎల్ (క్వార్టర్) బాటిల్‌పై రూ.20, 375 ఎంఎల్ (హాఫ్) బాటిల్‌పై రూ.40, 750 ఎంఎల్ (ఫుల్ బాటిల్)పై రూ.80 చొప్పున పెరిగాయి. 

అదే..ప్రీమియం బ్రాండ్ మద్యం ధరలు క్వార్టర్ బాటిల్‌పై రూ.40, హాఫ్ బాటిల్‌పై రూ.80, ఫుల్ బాటిల్‌పై రూ.160 చొప్పున పెరిగాయి. 

అదేవిదంగా వైన్ ధరలు కూడా క్వార్టర్ బాటిల్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున పెరిగాయి. 

 ఈ వేసవిలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన బీరు ధర కూడా ఒక్కో బాటిల్‌పై రూ.10 చొప్పున పెరిగింది. 

మద్యం ధరలు పెంచుతున్నట్లు సమాచారం అండగానే నిన్న రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలలో అమ్మకాలు నిలిచిపోయాయి. ఈరోజు ఉదయం నుంచి పెరిగిన ధరలతో యదాప్రకారం అందుబాటులో ఉంటాయి.

Related Post