అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఓడిశా యువకుడి అరెస్ట్

May 18, 2022
img

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఒడిశాకు చెందిన రాజు అనే యువకుడిని నిన్న ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, నగరంలో ఖైరతాబాద్‌కు చెందిన ఓ యువతి నిన్న అమీర్‌పేట వద్ద గల చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ పూర్తిచేసుకొని  మెట్రో స్టేషన్ లిఫ్టులో ప్రవేశించినప్పుడు, అక్కడే ఉన్న రాజు కూడా లిఫ్టులో జొరబడి ఆమె ఎదుట బట్టలు విప్పి నగ్నంగా నిలబడి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. 

ఆమె లిఫ్టులో నుంచి బయటకురాగానే మెట్రో సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వారు అతనిని పట్టుకొని తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. ఆ యువకుడు గత కొంతకాలం మెట్రో పరిసరాలలో తచ్చాడుతూ ఒంటరిగా మహిళలు కనిపిస్తే వారి వెంటపడి ఈవిధంగా అసభ్యంగా వ్యవహరిస్తున్నాడని మెట్రో సిబ్బంది చెప్పారు. 

పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, అతని మానసిక పరిస్థితిని తెలుసుకునేందుకు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తీసుకు వెళ్ళినట్లు తెలుస్తోంది. 

Related Post