భద్రాద్రికి భారత్‌ బయోటెక్ కంపెనీ భారీ విరాళం

May 16, 2022
img

కరోనా నివారణకు ‘కోవాక్సిన్‌’ పేరుతో దేశీయంగా వాక్సిన్లు తయారుచేసి అందజేసిన భారత్‌ బయోటెక్ కంపెనీ పేరు గత రెండేళ్ళలో దేశమంతటా మారుమ్రోగిపోయింది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భారత్‌ బయోటెక్ కంపెనీలో తయారవుతున్న వాక్సిన్లను చూసేందుకు హైదరాబాద్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సంస్థ ఉడతా భక్తిగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రులవారికి కోటి రూపాయలు కానుకగా సమర్పించుకొంది. ఈ సొమ్మును ఆలయంలో నిత్యాన్నధానం కొరకు వినియోగించాలని ఆలయ ఈవోను కోరి ఆలయ బ్యాంక్ ఖాతాలో ఆ సొమ్మును జమా చేసింది. 


Related Post