త్వరలో గజ్వేల్ నుంచి నేరుగా తిరుపతికి ట్రైన్

May 13, 2022
img

గజ్వేల్ ప్రజలకు ఓ శుభవార్త చెప్పారు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “గజ్వేల్ నుంచి నేరుగా తిరుపతికి ట్రైన్ సర్వీసులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. గజ్వేల్ నుంచి నేరుగా తిరుపతికి ట్రైన్ వస్తుందని బహుశః ఎవరూ ఏనాడూ ఊహించి ఉండరు. కానీ ఊహించనిదే ఇపుడు జరుగబోతోంది. దీని కోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది,” అని చెప్పారు. 

ఇది నిజంగా గజ్వేల్ వాసులకు శుభవార్తే. నేటికీ గజ్వేల్ వాసులు తిరుపతికి వెళ్లాలంటే తప్పనిసరిగా సికింద్రాబాద్‌ వచ్చి ఎక్కాల్సిందే. అదేవిదంగా తిరుపతి నుంచి తిరిగి వచ్చినప్పుడు హైదరాబాద్‌ నుంచి గజ్వేల్ చేరుకోవడానికి కొంత ఇబ్బందులు తప్పవు. కుటుంబ సమేతంగా గజ్వేల్ నుంచి సికింద్రాబాద్‌ వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కి, మళ్ళీ తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు చేరుకొని అక్కడి నుంచి గజ్వేల్ చేరుకోవడం చాలా ఇబ్బందికరమే. కనుక ఇప్పుడు గజ్వేల్-తిరుపతి-గజ్వేల్ మద్యన రైళ్లు నడిస్తే గజ్వేల్ ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 

Related Post