తెలంగాణలో తొలి మహిళా లైన్ ఉమెన్‌గా శిరీష నియామకం

May 13, 2022
img

ఇంతవరకు పురుషులు మాత్రమే కరెంటు స్తంభాలు ఎక్కి మరమత్తులు చేస్తుండేవారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సిద్ధిపేట జిల్లాకు చెందిన బబ్బూరి శిరీష అనే యువతి తొలి జూనియర్ లైన్ ఉమెన్‌గా నియమితురాలైంది. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా ఆమెకు ఉద్యోగ నియామక పత్రాన్ని నిన్న అందజేశారు. 

సిద్ధిపేట జిల్లాకు చెందిన బబ్బూరి శిరీష మేడ్చల్ జిల్లా మల్కాజిగిరీలో విద్యాభ్యాసం చేయడంతో అక్కడే తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌లో ఈ ఉద్యోగం సంపాదించింది. దీని కోసం ఆమె పురుష అభ్యర్ధులతో సమానంగా అన్ని పరీక్షలలో పోటీ పడి అర్హత సాధించించి. ఈ పరీక్షలలో భాగంగా ఆమె విద్యుత్‌ స్తంభాలు కూడా ఎక్కి తాను పురుష అభ్యర్ధులకు ఏ మాత్రం తీసిపోనని నిరూపించుకొంది. ఆమె అన్ని పరీక్షలలో అర్హత సాధించడంతో మొదట ఆమె దరఖాస్తును చూసి నవ్విన అధికారులు కూడా ఆమెకు అభినందనలు తెలియజేశారు.        


Related Post