ఒమిక్రాన్ ఎఫెక్ట్... సండే ఫండే బంద్

December 02, 2021
img

ప్రతీ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌, ట్యాంక్‌ బండ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేసి ‘సండే ఫండే’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కరోనా మళ్ళీ ఒమిక్రాన్ అనే కొత్త రూపంలో ప్రపంచదేశాలపై విరుచుకు పడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. జనసందోహం ఎక్కువగా ఉండే చోట ఈ ఒమిక్రాన్ వైరస్ శరవేగంగా విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపధ్యంలో ఈ నెల 5వ తేదీన జరిగే ‘సండే ఫండే’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్‌ ప్రకటించారు. 

అయితే ఒమిక్రాన్ వైరస్ ఉనికి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది కనుక కొన్ని నెలల వరకు ట్యాంక్‌ బండ్‌పై ఈ ‘సండే ఫండే’, ఛార్మినార్ వద్ద నిర్వహిస్తున్న ‘ఏక్ షామ్ ఛార్మినార్ కే నామ్’  కార్యక్రమాలు కూడా రద్దు చేసే అవకాశం ఉంది. 


Related Post