విషాదంలో మరో విషాదం

December 02, 2021
img

సిద్ధిపేట జిల్లాలో దుబ్బాక మండలంలో చిట్టాపూర్ గ్రామ శివార్లలో బుదవారం ఉదయం ఓ కారు రోడ్డు పక్కనే గల వ్యవసాయ బావిలో పడిపోయింది. దానిని క్రేన్ సాయంతో బయటకు తీసేందుకుగాను గజ ఈతగాళ్ళు బావిలోకి దిగి  కారుకి తాళ్ళు కట్టారు. వారిలో ఇనగుర్తి గ్రామానికి చెందిన నర్సింహులు కారుకి కట్టిన తాళ్ళలో చిక్కుకుపోయాడు. అతనిని కాపాడేందుకు మిగిలిన ఈతగాళ్ళు చాలా ప్రయత్నించారు. కానీ ఆలోగానే నర్సింహులు ఊపిరి ఆడక చనిపోయాడు.  

ఆ తరువాత క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. దానిలో తల్లీ కొడుకు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానికీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు నెంబరు ఆదారంగా మృతులను గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నారు.  


Related Post