దుబ్బాకలో ఘోర ప్రమాదం..బావిలో పడిన కారు

December 01, 2021
img

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలో బుదవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్టాపూర్-భూంపల్లి గ్రామాల మద్యన రోడ్డు పక్కనే గల ఓ వ్యవసాయబావిలో కారు పడిపోయింది. సమాచారం అందుకొన్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని వెంటపెట్టుకువచ్చి బావిలో పడిన కారును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గజఈతగాళ్ళు బావిలో దిగి కారులో ఉన్నవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు. బావి చాలా లోతుగా ఉండటం, నీళ్ళతో నిండి ఉండటం కారణంగా బావిలో పడిన కారును వెలికితీయడం కష్టమవుతోంది. కనుక పంపులతో బావిలో నీటిని బయటకు తోడి పోస్తున్నారు. బావిలో నుంచి కారును బయటకు తీస్తేగానీ దానిలో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు?వారు ఏ ప్రాంతానికి చెందినవారు?ఎంతమంది చనిపోయారనే విషయాలు బావిలో తెలీదు.ఈ విషయం తెలుసుకొన్న దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అక్కడకు చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  


Related Post