మేడ్చల్లో మాదక ద్రవ్యాల ముఠా అరెస్ట్

October 23, 2021
img

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందుతున్నకొద్దీ పబ్బులు, క్లబ్బుల సంఖ్య కూడా పెరుగుతోంది. వాటితో పాటు మాదకద్రవ్యాల సరఫరా వాడకం కూడా పెరుగుతోంది. ఎక్సైజ్ పోలీసులు వలపన్ని మేడ్చల్ మల్కాజిగిరీ జిల్లాలో ఒక డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. ఒక కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4.92 కేజీల నిషేదిత మెపిడ్రిన్ అనే మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. దాని విలువ సుమారు రూ. రెండు కోట్లు పైగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమీషనర్‌ ఏ చంద్రయ్య గౌడ్ తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం వెతుకుతునమని గౌడ్ చెప్పారు.    


Related Post