యాదాద్రికి బంగారం విరాళం ఇవ్వాలనుకొంటున్నారా?

October 22, 2021
img

యాదాద్రి ఆలయ గోపురానికి బంగారంతో తాపడం చేయించడానికి అందరూ విరాళాలు ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు పారిశ్రామికవేత్తలు తదితరులు కలిపి మొత్తం 28 కేజీల బంగారం విరాళంగా ప్రకటించారు. ఈ దైవకార్యం కోసం సామాన్య ప్రజలు మొదలు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేసేందుకు ముందుకు వస్తున్నారు. అటువంటి వారి కోసం యాదాద్రి ఆలయంలో ప్రత్యేకంగా హుండీలు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాలలో ఉన్నవారి కోసం యాదాద్రి ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఓ బ్యాంక్ అకౌంట్ తెరిచారు. అకౌంట్ తెరిచిన రెండు రోజులలోనే రూ. 27 లక్షలు విరాళాలు అందాయని అధికారులు తెలిపారు. ఈ బంగారు తాపడం కోసం విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. 

దూర ప్రాంతాలలో ఉన్నవారు ఈ దిగువన పేర్కొన్న బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్‌లో విరాళాలు పంపించవచ్చు.

ఇండియన్ బ్యాంక్, యాదగిరిగుట్ట బ్రాంచ్, 

అకౌంట్ నెంబర్: 6814884695

ఐఎఫ్ఎస్‌సీ నెంబర్: IDBI000YO11 

Related Post