దయనీయస్థితిలో ఆఫ్ఘన్‌ మహిళా ఫుట్‌బాల్‌ టీం

September 16, 2021
img

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యాక అక్కడి మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా మహిళా క్రీడాకారులు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విదేశాలకు పారిపోయేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ మహిళా ఫుట్‌బాల్‌ బృందం కూడా తాలిబన్ల నుంచి తృటిలో తప్పించుకొని పాకిస్థాన్‌ పారిపోయింది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాకిస్థాన్‌ పారిపోయి వచ్చారు. బ్రిటన్కు చెందిన ఓ ఎన్జీవో సంస్థ పాకిస్థాన్‌ ప్రభుత్వంతో మాట్లాడి వారందరికీ అత్యవసరంగా వీసాలు మంజూరు చేయించింది. ప్రస్తుతం వారందరికీ లాహోర్‌లో తాత్కాలికంగా ఆశ్రయం కల్పించినట్లు సమాచారం. వారందరూ ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ప్రాణాలతో బయటపడగలిగారు కానీ ఇప్పుడు వారి భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా ఉంది. పాకిస్థాన్‌ ప్రభుత్వం దయతలిచి వారందరినీ దేశంలో ఉండనిస్తే ఏదోవిదంగా జీవిస్తారు లేకుంటే మళ్ళీ కష్టాలు, కన్నీళ్లు తప్పవు. 


Related Post