హైదరాబాద్‌లో ఇద్దరు పారిశుద్య కార్మికులు మృతి

August 04, 2021
img

హైదరాబాద్‌ నగరంలో మంగళవారం రాత్రి విషాదకర సంఘటన జరిగింది. ఎల్బీ నగర్‌లోని పరిధిలోని సాహెబ్ నగర్‌లో ఓ మ్యాన్ హోల్ బ్లాక్ అయ్యింది. కాంట్రాక్టర్ ఒత్తిడి చేయడంతో నిన్న రాత్రి అంతయ్య, శివ అనే ఇద్దరు పారిశుద్య కార్మికులు దానిలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు లోపలకు దిగినప్పుడు గల్లంతయ్యారు. సమాచారం అందుకొన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని అతికష్టం మీద ఒక మృతదేహాన్ని వెలికితీశారు. రెండో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మ్యాన్ హోల్ లోపల విషపూరితమైన వాయువులు పీల్చడంతో చనిపోయుంటారని పోలీసులు భావిస్తున్నారు.    


Related Post