భారత్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్

August 02, 2021
img

కరోనా దేశ ప్రజలకు కనీవినీ ఎరుగని చేదు అనుభవాలను రుచి చూపించింది. కోట్లాదిమంది పేద, మద్యతరగతి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఏమీ చేయలేక చేతులెత్తేస్తే నేనున్నానంటూ..బాలీవుడ్ విలన్ సోనూసూద్ రంగప్రవేశం చేశాడు. గత ఏడాది భారత్‌లో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి నేటి వరకు, బహుశః ఇక ఎప్పటికీ సహాయ కార్యక్రమాలు ఓ యజ్ఞoలా చేస్తున్నాడు. అంతవరకు సోనూసూద్‌ను ఒక నటుడిగా మాత్రమే చూసిన దేశప్రజలు ఆయనలో ఓ నిజమైన హీరోను...దేవుడిని చూశారు. ఇప్పుడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో సోనూసూద్ అంటే తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. కష్టకాలంలో దేశప్రజలకు ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది రష్యాలో జరుగనున్న స్పెషల్ ఒలింపిక్స్‌లో సోనూసూద్  భారత్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. ఈవిషయం ఆయనే స్వయంగా తెలియజేస్తూ, “భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమింపబడినందుకు చాలా గర్వంగా ఉంది,” అని ట్వీట్ చేశారు. 

           


Related Post