నేడు దాశరది జయంతి

July 22, 2021
img

తెలంగాణలో ఎంతోమంది కవుల, రచయితల పుట్టినిల్లుగా కీర్తి గడించింది. అలాంటి వారిలో దాశరధి ఒకరు. దాశరధిగా ప్రసిద్ధి పొందిన ఆయన పూర్తి పేరు దాశరధి కృష్ణమాచార్యులు ఈ రోజు ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. కవిగా, రచయితగా, బహుభాషా కోవిదుడుగా ఆయన అందరికీ సుపరిచితుడు.

దాశరధి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా జైలు జీవితాన్ని గడిపారు. ఆ తరువాత గొప్ప అభ్యుదయ కవిగా కీర్తి పొందారు. అయన 1925 జూలై 22న అప్పటి వరంగల్ జిల్లాలోని చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం చిన్నగూడూరు మహబూబాబాద్ జిల్లాలో ఉంది. 

ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆంధ్ర సాహిత్యంలో బిఏ పట్టా పొందారు. ఆ తర్వాత కొంతకాలం పాటు  ఉపాధ్యాయుడిగాని, పంచాయతీ ఇన్స్పెక్టర్‌గా, ఆకాశవాణి ప్రయోక్తగా పూర్తి భిన్నమైన ఉద్యోగాలు చేశారు. ఆ సమయంలో నిజాం పరిపాలనలో ప్రజలు అనుభవిస్తున్న బాధలను చూసి తన పదునైన పదాల పద్యాలతో ప్రజలను చైతన్య పరిచారు. అందుకుగాను నిజాం పరిపాలకులు ఆయనను ఇందూరు జైల్లో ఉంచారు. దాశరధి జైలు గోడలపై బొగ్గుతో పద్యాలు రాసి పాలకులకు తన ధిక్కార స్వరం వినిపించారు. ఆవిధంగా నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించారు. ఆయనకు 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అవార్డు, 1974లో కేంద్ర సాహిత్య అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ వంటి ఎన్నో అవార్డులు వరించాయి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 నుంచి 1983 వరకు సేవలను అందించారు. ఆయన పలు సినిమాలకు పాటలను రచించారు. ఆయన 1987 నవంబర్ 5న మరణించాడు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా అప్పటికీ ఆయన ఇచ్చిన నినాదం సూర్యచంద్రులు ఉన్నంత వరకు మారుమోగుతూనే ఉంటుంది.

 దాశరధి ఆణిముత్యాలు మచ్చుకు కొన్ని

• నా తెలంగాణ కోటి రత్నాల వీణ!

• రైతుదే...తెలంగాణ రైతుదే

• ముసలి నక్కకు రాచరికం దక్కునే 

• దగాకోరు బటాచోర్  రజాకారు పోషకుడు దిగుబొమ్మని జగమంతా నగరాలు కొడుతుంది. దిగిపోయి, తెగిపోయి.

• ఓ నిజాము పిశాచమా!

• నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు!

•  ఎముకలు మసిచేసి పొలాలు దున్ని భూషణ నంబులు నవాబులకు, స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణ రైతుదే!

సినిమా పాటలు:

• ఖుషి ఖుషిగా నవ్వుతూ (ఇద్దరు మిత్రులు)

• గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది (మూగ మనసులు)

Related Post