నేడు సూర్యగ్రహణం

June 10, 2021
img

నేడు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది.భారత కాలమాన ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 1.42 నుండి సాయంత్రం 6.41 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ సందర్భంగా సూర్యుడి చుట్టూ వలయాకారంలో ఓ రింగ్ ఏర్పడుతుంది. దీనినే రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. సూర్యుడికి, భూమికి మద్య చంద్రుడు ప్రవేశించడంతో ఈ రింగ్ ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈరోజు భారత్‌లో సూర్యగ్రహణ ప్రభావం ఉండదు కనుక ఎటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదని పంచాగకర్తలు చెపుతున్నారు. యూరప్, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, ఉత్తర అమెరికా, గ్రీన్‌ లాండ్ దేశాలలో మరియు ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాలలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది కనుక ఆయా దేశాలలో ఈ రింగ్ ఆఫ్ ఫైర్ స్పష్టంగా కనబడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెపుతున్నారు.    


Related Post