నేటి నుంచి అన్నపూర్ణ క్యాంటీన్లలలో భోజనం ఉచితం

May 18, 2021
img

జీహెచ్‌ఎంసీ, హరేకృష్ణ (అక్షయపాత్ర) కలిసి హైదరాబాద్‌ పరిధిలో 250 అన్నపూర్ణ క్యాంటీన్లు నిర్వహిస్తున్నాయి. వాటిలో కేవలం రూ.5లకే రుచికరమైన భోజనం పెడుతూ రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు, విద్యార్దులు, రోగుల సహాయకులు, అనాధలు, బిచ్చగాళ్ళ కడుపులు నింపుతున్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఇప్పుడు హోటల్స్, టిఫిన్ సెంటర్లు అన్ని బంద్‌ అవడంతో వారందరూ ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి రావడంతో అన్నపూర్ణ క్యాంటీన్లలో నేటి నుంచి ఉచితంగా భోజనం పెట్టాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు ఉచిత భోజనం అందిస్తుండాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.  


Related Post