నేటి నుంచి రాష్ట్రంలో కరోనా మందుల కిట్స్ పంపిణీ

May 03, 2021
img

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడ్డ వ్యాధిగ్రస్తులకు ఇంటివద్దనే చికిత్స పొందేందుకు వీలుగా అవసరమైన మందుల కిట్‌ను ఈరోజు నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. వీటిలో మందులతో పాటు బి కాంప్లెక్స్, జింక్ టాబ్లెట్లు, శానిటైజర్ బాటిల్, సోడియం హైపోక్లోరైట్ బాటిల్, గ్లౌజులు, నోస్ మాస్కులు, లిక్విడ్ హ్యాండ్ వాష్, కరోనా చికిత్సా విధానం తెలియజేసే ఓ కరపత్రం ఉంటాయి.  


Related Post