ఏపీలో బుదవారం నుంచి పగలు పాక్షిక కర్ఫ్యూ

May 03, 2021
img

ఏపీలో రోజురోజుకీ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతుండటంతో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంది. బుదవారం నుంచి రెండువారాల పాటు పగలు కూడా పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కనుక ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ వగైరాలు పనిచేస్తాయి. మళ్ళీ మర్నాడు ఉదయం 6 గంటల వరకు అంటే రోజుకి 18 గంటల చొప్పున రాష్ట్రమంతటా రెండు వారాలపాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కనుక తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళేవారు ఈ కర్ఫ్యూ సమయాలను గుర్తుంచుకొని తదనుగుణంగా బయలుదేరడం మంచిది. 


Related Post