భారత్‌లో మళ్ళీ భారీగా కరోనా కేసులు

March 04, 2021
img

భారత్‌లో మళ్ళీ భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా కొత్త 14,989 కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలోనే 9,855 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 98 మంది కరోనాతో మరణించగా వారిలో 42 మందిమహారాష్ట్రలోని వారే. తాజా లెక్కల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో 1,11,39,516 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 1,08,12,044 మంది కోలుకోగా 1,57,346 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,70,126 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రికవరీ శాతం 97.06 శాతం ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 21,84,03,277 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.  గత 24 గంటలలో నమోదైన కేసులలో 85.95 శాతం కేసులు ఆరు రాష్ట్రాలలోనే నమోదైనట్లు తెలిపింది. , మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో మళ్ళీ కరోనా తీవ్రత పెరిగినట్లు కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే మరోపక్క కరోనా వాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.  

Related Post