తెలంగాణ నయాగరా... మన బొగత జలపాతం

February 27, 2021
img

సాధారణంగా జలపాతం పేరు చెప్పగానే మనకు అమెరికాలోని నయాగరా జలపాతం టక్కున గుర్తుకొస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా నయాగారాలాంటి అందమైన జలపాతం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి సమీపంలో పచ్చని దట్టమైన అడవుల మధ్య బొగత జలపాతం ఉంది.

బొగత జలపాతం చుట్టూ ఊటీని కూడా మైమరిపించే ప్రకృతి అందాలు చూడచక్కగా ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకు బొగత జలపాతం చూడదగ్గ పర్యాటక కేంద్రం. బొగత జలపాతానికి వెళ్ళటానికి హైదరాబాద్ నుండి భద్రాచలం వరకు  ట్రైన్ లేదా బస్సులో ప్రయాణించవచ్చు. అక్కడినుండి బొగత జలపాతానికి ఆర్టీసీ బస్సులో లేదా ప్రైవేట్ వాహనాలలో చేరుకోవచ్చు. 


Related Post