అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ

February 26, 2021
img

కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా ఈరోజు సాయంత్రం పశ్చిమ బెంగాల్‌, అసోమ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. కనుక నేటి నుంచి ఆయా రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ప్రకటించారు. 

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో 294 శాసనసభ స్థానాలకు మొత్తం 8 దశలలో ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ ఎన్నికలు మార్చి 27వ తేదీన జరుగుతాయి. ఆ తరువాత వరుసగా ఏప్రిల్ 1, ఏప్రిల్ 6, ఏప్రిల్ 10, ఏప్రిల్ 17, ఏప్రిల్ 22, ఏప్రిల్ 29వరకు ఎన్నికలు జరుగుతాయి.  

అస్సోంలో 126 శాసనసభ స్థానాలకు 3 దశలలో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6 తేదీలలో ఎన్నికలు జరుగుతాయి.  

కేరళలోని 140 స్థానాలకు,  తమిళనాడులోని 234 స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు ఏప్రిల్ 6వ తేదీన ఒకే దశలో ఎన్నికలు నిర్వహించబడతాయి.

వీటితో పాటు 16 రాష్ట్రాలలో 34 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికలు జరుగుతాయి. త్వరలోనే వాటికి ప్రత్యేకంగా ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటిస్తామని సునీల్ అరోరా తెలిపారు. 

అన్ని ఎన్నికలకు మే 2వ తేదీన ఓట్లు లెక్కించి అదే రోజున ఫలితాలు ప్రకటిస్తామని సునీల్ అరోరా తెలిపారు.

Related Post