జగిత్యాలలో కోడిపుంజు అరెస్ట్... ఎఫ్ఐఆర్ నమోదు!

February 26, 2021
img

అవును! కోడిపుంజునే పోలీసులు అరెస్ట్ చేసి దానిపై హత్యానేరం కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కోడిపుంజును సెల్లులో ఉంచడం సాధ్యం కాక స్టేషన్ బయట చెట్టుకు కట్టేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కనుక నేడో రేపో దానిని కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెడతారు..పెడితే న్యాయమూర్తి కేసును కొట్టేస్తారా లేక దానికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించి జైలుకు పంపిస్తారో తరువాత తెలుస్తుంది. 

ఇంతకీ ఈ కోడిపుంజుపై హత్యానేరం మోపడం ఏమిటంటే...జిల్లాలోని వెలగటూరు మండలంలో కొండాపూర్‌కి చెందిన సతీష్ అనే యువకుడు కోడిపందేలు ఆడేందుకు తన కోడిపుంజు కాలికి పదునైన కత్తిని కట్టాడు. దానిని రెండుచేతులతో పట్టుకొన్నప్పుడు దాని కాలికి కట్టిన కత్తి అతని పొట్టలో దిగబడింది. స్థానికులు అతనిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుంటే తీవ్ర రక్తస్రావం కావడంతో దారిలోనే చనిపోయాడు. దాంతో సతీష్ మరణానికి ఎవరిని అరెస్ట్ చేయాలో తెలియక పోలీసులు ఆ కోడిపుంజును అరెస్ట్ చేసి దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జడ్జిగారు దానికి ఏ శిక్ష విధిస్తారో చూడాలి! 

Related Post