రేపటి నుంచి సమ్మక్క, సారక్క చిన్న జాతర

February 23, 2021
img

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారక్క చిన్న జాతర రేపటి నుండి ప్రారంభం అవుతుంది. సమ్మక్క, సారక్క జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. అయితే భక్తుల కోరిక మేరకు 2007 సంవత్సరం నుండి సమ్మక్క, సారక్క చిన్న జాతర నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి కూడా అశేష సంఖ్యలో భక్తులు వస్తారు. జాతర రేపటి నుండి ప్రారంభమై ఈ నెల 27వకు జరుగుతుంది.  ఇప్పటికే అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు రావడం మొదలైంది. కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవార్లను దర్శించుకున్న వాలని భక్తులకు ఆలయ సిబ్బంది విజ్ఞప్తి చేసింది

Related Post