రామగుండంలో ఇద్దరు బంగారు వ్యాపారులు మృతి

February 23, 2021
img

పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బంగారు వ్యాపారులు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు వారి వద్ద కేజీ బంగారం ఉంది. గుంటూరు జిల్లాలోని నరసారావుపేటకు చెందిన వారు జిల్లాలోని బంగారు దుకాణాలకు బంగారం అమ్ముతుంటారు. ఈరోజు తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు మాల్యాలపల్లి రైల్వే బ్రిడ్జి వద్దగల మలుపులో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. 

వారిలో కొత్త రాంబాబు, కొత్త శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యాపారులు ఘటనాస్థలంలోనే మరణించారు. సంతోష్, సంతోష్ కుమార్ అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరినీ గోదావరిఖని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.    


Related Post