పవన్ కళ్యాణ్ కోనసీమ-తెలంగాణ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నేడు యాదగిరిగుట్ట వద్ద మీడియాతో మాట్లాడుతూ, “చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ మా నైజాం ఏరియాలో సినిమాల వల్లనే ఈ స్థాయికి ఎదిగారు.
కానీ ఈ విషయం మరిచి ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మా తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడారు. ఇది అయన స్థాయికి తగదు. ఇకనైనా ఆయన బేషరుతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి,” అని కోరారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇంచుమించు ఇలాగే పవన్ కళ్యాణ్‌ని కోరారు. అంతేకాదు... బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణలో ఇక అయన సినిమాలు ఆడనివ్వమని కుండ బద్దలు కొట్టిన్నట్లు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పందిస్తారో... ఏవిదంగా స్పందిస్తారో చూడాలి!
Video courtesy: Big TV Breaking News)