తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కి బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఏపీలోని కోనసీమ జిల్లాలో పర్యటించినప్పుడు తెలంగాణ నేతల దిష్టి తగలడం వల్లనే కొనసీమ ఇలా తయారైందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా ఎవరినీ నొప్పించని పవన్ కళ్యాణ్ ఈవిధంగా ఎందుకు మాట్లాడారో కానీ ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలని నొప్పించాయి. కనుక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేకుంటే ఇక్కడ అయన సినిమాలు ఇక ఆడనివ్వము. ఒకవేళ క్షమాపణ చెప్పుకుంటే ఆయన సినిమాలు ఒకటి రెండు రోజులు ఆడే అవకాశం ఉంటుంది,” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఒక్క సినిమా కూడా ఆడనివ్వం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ దిష్టి అంటూ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి
చిరంజీవి మంచోడు.. వివాదాలకు దూరంగా ఉంటాడు
కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు
- మంత్రి కోమటిరెడ్డి pic.twitter.com/1IVPtmwsXR