బిఆర్ఎస్‌ని ప్రక్షాళన చేయాల్సిందే: కవిత

July 03, 2025


img

బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలను బయటపెట్టి పార్టీకి దూరమైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ప్రముఖ టీవీ 5 తెలుగు ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. 

“ఇదివరకు జగన్‌ని, ఏపీలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు వారికి అండగా నిలబడి పోరాడారు. కానీ మద్యం కుంభకోణం కేసులో నన్ను అరెస్ట్‌ చేసినప్పుడు బిఆర్ఎస్ పార్టీ నాకు అండగా నిలబడలేదు. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ ననను పట్టించుకోలేదు. నా కోసం పోరాడలేదు.

అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి ఆవిదంగా వ్యవహరించారని అనుకున్నా, పార్టీలో నన్ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు కొందరు కుట్రలు చేశారు. ఆ కుట్రల కారణంగానే నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలలో నేను ఓడిపోయాను. నేటికీ నాకు వ్యతిరేకంగా పార్టీలో కొందరు కుట్రలు చేస్తూనే ఉన్నారు. నేను కేసీఆర్‌కి వ్రాసిన లేఖ మీడియాకి లీక్ చేయడమే ఇందుకు నిదర్శనం. 

ఇదే విషయం నేను అడుగుతుంటే పార్టీ నుంచి ఇంతవరకు జవాబు రాలేదు. నా కేసుకి సంబందించి ఫీజులు మొత్తం నా తండ్రి కేసీఆరే చెల్లించారు. అయితే నాకు వ్యతిరేకంగా పార్టీలో జరుగుతున్న కుట్రలని అడ్డుకోలేకపోయారు. అటువంటి వారిని వదిలించుకోకపోతే మనమే నష్టపోతామని చెపుతున్నాను తప్ప పార్టీతో కానీ కేసీఆర్‌తో గానీ నాకు ఎటువంటి శతృత్వం లేదు,” అని అన్నారు.


Related Post