గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం: ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలు

May 18, 2025


img

ఆదివారం ఉదయం పాతబస్తీ, చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్‌ అగ్నిప్రమాదంలో 17 మంది చనిపోయారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ ప్రమాదంలో గాయపడినవారికి అవసరమైన చికిత్స చేయిస్తాము. 

అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా వచ్చారనే ఆరోపనలలో నిజం లేదు. ఉదయం 6.10 గంటలకు ఫోన్‌ రాగానే అగ్నిమాపక సిబ్బంది 10 అగ్నిమాపక వాహనాలతో వెళ్ళి మంటలు ఆర్పేశారు. భవనంలో చిక్కుకున్నవారిని సురక్షితంగా తీసుకువచ్చే ప్రయత్నంలో సిబ్బందిలో ఒకరు అస్వస్థతకు గురయ్యారు. 

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమిక సమాచారం. కారణం ఏదైనప్పటికీ ఈ అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇటువంటి విషాద ఘటనలు మళ్ళీ జరుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాను,” అని భట్టి విక్రమార్క అన్నారు. 


Related Post